30 రోజుల్లో ప్రేమించడం ఎలా? : మూవీ రివ్యూ
- January 29, 2021
యాంకర్‌గా మంచి గుర్తింపు పొందిన ప్రదీప్ మాచిరాజు..పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. ఇటీవల హీరోగా మారి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే చిత్రంలో నటించారు. గత ఏడాది విడుదల చేయాల్సి ఉండగా..కరోనా ఎఫెక్ట్ అన్నీ సినిమాలకు మాదిరిగానే ఈ చిత్రంపై పడింది. ఈ చిత్రంలో నీలినీలి ఆకాశం పాటను ఎంతో పేరు రావడంతో...ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఎట్టకేలకు మళ్లీ థియేటర్లు తెరుచుకోవడంతో జనవరి 29న శుక్రవారం విడుదలైంది. మరి ఆ సినిమా ప్రేక్షకులు ముందే ఊహించినట్లుగా.. ఉందా లేదా అని తెలియాలంటే..ఆ సినిమా గురించి తెలుసుకోవాల్సిందే..!
కథ
అర్జున్ (ప్రదీప్ మాచిరాజు), అక్షర (అమృత అయ్యర్) వైజాగ్‌లో పక్కపక్క ఇళ్లలోనే ఉంటూ.. ఒకే కాలేజీలో బి.టెక్ చదువుకుంటుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీలా ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు. ఓ సందర్భంలో అర్జున్, అక్షర కాలేజీ స్నేహితులతో కలిసి అరకు టూర్‌కి వెళతారు. అక్కడికి వెళ్లాక కూడా ఇద్దరూ గొడవ పడతారు. ఈ క్రమంలోనే అర్జున్, అక్షర ఒకరి శరీరంలోకి మరొకరు ప్రవేశిస్తారు. అసలు అలా ఎందుకు శరీరంలోకి ప్రవేశించాల్సి వచ్చింది? గత జన్మలో వారిద్దరికి గల సంబంధమేంటి? ఆ జన్మలో ఏం జరిగింది?... మరలా తిరిగి వారి శరీరాల్లోకి వెళ్లడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తారనేది సినిమా కథ.
విశ్లేషణ : జన్మజన్మల ప్రేమ కథ ఇది. ప్రేమ అనగానే అందులో ఫీల్ కనిపించాలి. అయితే ఈ కథలో ఆ ఫీల్ లోపించిందనే చెప్పుకోవచ్చు. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. కథనం పట్టు తప్పడంతో గందరగోళం ఏర్పడింది. అక్కడక్కడ కామెడీ సన్నివేశాలున్నా.. పెద్దగా నవ్వులు పూయించలేదు. ఇక నాయకానాయికల ఇరుకుటుంబాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు భావోద్వేగాల్ని పండిస్తాయి.
ఎవరెలా చేశారంటే..
బుల్లితెర యాంకర్‌గా వెలుగొందుతున్న ప్రదీప్ మాచిరాజు.. హీరోగా తొలిచిత్రమే అయినా.. తన పరిధి మేరకు ఆ పాత్రకు తగ్గట్టుగా నటించారు. ఇక హీరోయిన్ అమృత అయ్యర్ కూడా బాగా నటించారు. హేమ, పోసాని కృష్ణమురళి పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. అనూప్రూబెన్ పాటలతోపాటు, నేపథ్య సంగీతం చిత్రానికి బలాన్నిచ్చాయి. ఇక శివేంద్ర కెమెరా పనితనం మెప్పిస్తుంది. దర్శకత్వం వహించిన మున్నా.. తను పడిన కష్టం తెలుస్తుంది కానీ.. ఇంకాస్త ఎఫెక్టివ్‌గా కథను రెడీ చేయడం కానీ.. లేక చూపించడం గానీ చేస్తే ఇంకా బాగుండేది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష