తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- January 31, 2021
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహ్మరి కాస్త తగ్గుముఖం పట్టింది. గత కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల క్రమంగా తగ్గుతూ వస్తుంది. కాగా, శుక్రవారం రాత్రి 8గంటల నుంచి శనివారం రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 163 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,469కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది.
కాగా, శనివారం కరోనా రాకాసి బారిన పడి ఒకరు మృతి చెందారు. దీంతో తెలంగాణలో మొత్తం మృతుల సంఖ్య 1,599కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 276 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక, ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,90,630కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,240 ఉండగా.. వీరిలో 828 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 1412 మంది రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇదిలావుంటే, నిన్న ఒక్కరోజే జీహెచ్‌ఎంసీలో కొత్తగా 28 కేసులు నమోదయ్యాయి. అయితే, ఇప్పటివరకు తీసుకున్న కఠిన చర్యలతో కరోనా మహమ్మారిని నియంత్రించగలిగామని అధికారులు తెలిపారు. అయినప్పటికీ ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలను తప్పసరిగా పాటించాలని కోరారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







