ఉద్యోగులకు పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి చేసిన రస్ అల్ ఖైమా
- January 31, 2021
రస్ అల్ ఖైమా:కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు ఉద్యోగులు ప్రతి ఏడు రోజులకు ఓ పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలన్న యూఏఈ నిర్ణయాన్ని రస్ అల్ ఖైమా కూడా అమల్లోకి తీసుకొచ్చింది. అజ్మన్, ఉమ్ అల్ ఖ్వైన్ గవర్నరేట్‌లో ఇప్పటికే ఉద్యోగులకు పీసీఆర్ టెస్ట్ నిబంధనను అమలులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు రస్ అల్ ఖైమా కూడా అదే బాటలో వెళ్తోంది. తమ పరిధిలోని ఉద్యోగులు ప్రతి వారం తమ సొంత ఖర్చులతో తప్పనిసరిగా పీసీఆర్ టెస్ట్ చేయించుకొని నెగటీవ్ రిపోర్ట్ తో ఆఫీసులకు రావాలని ఆదేశించింది. ఈ నిబంధన ఫిబ్రవరి 7 నుంచి అమలులోకి వస్తుందని వెల్లడించింది. అయితే..రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రం పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇక వైద్య పరమైన కారణాలతో వ్యాక్సిన్ తీసుకునేందుకు అనర్హలుగా పేర్కొన్న వారికి పీసీఆర్ టెస్ట్ ఖర్చులను ఆయా సంస్థలే భరించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







