కారులో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన సౌదీ వ్యక్తి అరెస్ట్

- January 31, 2021 , by Maagulf
కారులో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన సౌదీ వ్యక్తి అరెస్ట్

రియాద్:ఓ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన సౌదీ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు కారులో ఉన్న మహిళల పట్ల అసభ్య హవాభావాలు ప్రదర్శిస్తూ దాన్ని వీడియో కూడా తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. అయితే..ఆ వీడియో కాస్త పోలీసుల దృష్టికి వెళ్లటంతో ఆ యువకుడిపై చర్యలు తీసుకున్నారు. వేధింపుల కేసుతో పాటు సైబర్ క్రైమ్ కేసులను నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రాథమికంగా జరిపిన విచారణ మేరకు చట్టపరమైన చర్యలు చేపట్టి న్యాయ విచారణకు కేసు బదిలీ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com