దుబాయ్ ఐబిఎన్ బట్టుట మాల్లో నకీల్ కొత్త హోటల్
- February 24, 2016
దుబాయ్‌కి చెందిన నఖీల్, థాయ్‌లాండ్‌కి చెందిన మినార్ హోటల్ గ్రూప్‌తో కలిసి 372 రూమ్స్ గల హోటల్ని ఐబీఎన్ బత్తుర మాల్లో నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అవని హోటల్స్ మరియు రిసార్ట్స్ బ్రాండ్ మీద ఈ హోటల్ నిర్వహించబడుతుంది. ఐబిఎన్ బత్తురాలో 14 అంతస్తుల నఖీల్ హోటల్ డైరెక్ట్‌గా మాల్లోకీ, అలాగే దుబాయ్ మెట్రోకీ లింక్‌గా ఉంటుంది. ఐదు నెలల్లో నఖీల్ మరియు మినార్ హోటల్ గ్రూప్ మధ్య ఇది రెండో ఒప్పందం. అవని ఐబిఎన్ బత్తుర, 4.7 మిలియన్ బత్తుర మాల్కి 4.7 మిలియన్ చదరపు అడుగుల విస్తరణలో భాగంగా రూపొందుతోంది. 766,000 చదరపు అడుగుల షాపింగ్, డైనింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ స్పేస్ అవని ఐబిఎన్ బత్తురకు ఉండనుంది. 372 రూములు గల ప్రీమియర్ ఇన్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ ఏడాదిలోనే ఇది ప్రారంభమవుతోంది. నఖీల్ 10 హోటళ్ళను ప్రారంభించనుంది. మొత్తం 4,000 రూములతో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. 251 రూముల గల ఐబిస్ స్టైల్స్ హోటల్ డ్రాగన్ మార్ట్ వద్ద ఇటీవలే ప్రారంభమైంది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







