కువైట్ ప్రయాణికులపై ఎయిర్ పోర్ట్ ఫీజు బాదుడు..
- January 31, 2021_1612095834.jpg)
కువైట్ సిటీ:కువైట్ విమానాశ్రయం నుంచి రాకపోకలు నిర్వహించే ప్రయాణికులు ఇకపై అదనపు భారం మొయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ పోర్టు ఫీజు ఛార్జీల పేరుతో ప్రతి టికెట్ పై 3 దినార్లను అదనంగా వసూలు చేయనుంది. ఈ మేరకు సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కువైట్ నుంచి ఇతర ప్రాంతాలకు బయల్దేరే ప్రయాణికులకు ప్రతి టికెట్ పై 3 దినార్లు ఎయిర్ పోర్ట్ ఫీజుగా ఛార్జ్ చేయనున్నారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి కువైట్ కు వచ్చే ప్రయాణికులపై ప్రతి టికెట్ కు రెండు దినార్లు ఛార్జ్ చేయనున్నారు. జూన్ 1 నుంచి ఈ కొత్త ఛార్జీలు అమలులోకి వస్తాయి. కువైట్ నుంచి రాకపోకలు నిర్వహించే ప్రవాసీయులతో పాటు కువైట్ పౌరులకు కూడా ఈ రూల్ వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ తమ ఉత్తర్వులో పేర్కొంది. ఎయిర్ పోర్టు ఛార్జీలను ఎయిర్ లైన్స్ లు తమ టికెట్ ధరలోనే యాడ్ చేయనున్నాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష