ప్రముఖ డైరెక్టర్ శంకర్‌కి నాన్ బెయిలబుల్ వారెంట్

- January 31, 2021 , by Maagulf
ప్రముఖ డైరెక్టర్ శంకర్‌కి నాన్ బెయిలబుల్ వారెంట్

చెన్నై:తమిళ అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కిన ‘రోబో’ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో తెలిసిందే. అయితే ఈ సినిమా కథ తనదే అంటూ గతంలోనే ప్రముఖ రైటర్ అరూర్ తమిళనందన్ కోర్టుకెక్కారు. తాను రాసిన ‘జిగుబా’ అనే కథ ఆధారంగా రోబో తెరకెక్కించారని తమిళనందన్ ఆరోపించారు. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కోర్టు అనేక సార్లు స్పష్టం చేసిన శంకర్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో ఆయనపై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. తదుపరి కేసు విచారణను ఫిబ్రవరి 19వ తేదీకి వాయిదా వేసింది. రచయిత అరుర్‌ తమిళ్‌నందన్‌ రచించిన ‘జిగుబా’ కథ 1996లో ఓ తమిళ మ్యాగజైన్‌లో ప్రచురించారు. అదే కథ 2007లో ఓ నవలగా రూపొందింది. కాగా, శంకర్‌ డైరెక్షన్‌లో రజనీకాంత్‌, ఐశ్వర్యరాయ్‌ నటించిన ‘రోబో’ సినిమా శంకర్ బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com