‘ఆదిపురుష్’ సెట్ లో భారీ అగ్నిప్రమాదం

- February 02, 2021 , by Maagulf
‘ఆదిపురుష్’ సెట్ లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్:రెబల్‌ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘ఆదిపురుష్’. మోషన్‌ క్యాప్చర్‌ టెక్నాలజీ వర్క్‌ను ఇటీవలే స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ ‌ఈరోజు సినిమాను లాంఛనంగా ప్రారంభించింది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ సినిమా మొదటి రోజు సెట్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చిత్ర యూనిట్ తొందరగా అప్రమత్తం అయినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ముంబైలో జరిగిన ఈ అగ్నిప్రమాద విజువల్స్ బట్టి చూస్తే షూటింగ్ సెట్ పూర్తిగా దగ్ధం అయినట్లు తెలుస్తోంది. రామాయణం ఆధారంగా రూపొందుతున్న భారీ బడ్జెట్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిలిం ‘ఆదిపురుష్’ లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించబోతున్నారు. రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. టీ సిరీస్‌ బ్యానర్‌ భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌లతో పాటు ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రాజేష్‌ నాయర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com