ఇండియాతో సహా 20 దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన సౌదీ అరేబియా
- February 03, 2021
రియాద్:కోవిడ్ 19ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సౌదీ అరేబియా కఠిన చర్యలు చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా భారత్ తో సహా మొత్తం 20 దేశాల నుంచి ప్రయాణికుల రాకపై నిషేధం విధించింది. సౌదీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్వర్వుల మేరకు అర్జెంటీనా, యూఏఈ, అమెరికా, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఐర్లాండ్, ఇటలీ, పాకిస్తాన్, బ్రెజిల్, పోర్చుగల్, యునైటెడ్ కింగ్‌డమ్, టర్కీ, దక్షిణాఫ్రికా, స్వీడన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, లెబనాన్, ఈజిప్ట్, జపాన్ ఉన్నాయి. సౌదీ పౌరులకు మినహా నిషేధిత జాబితాలో ఉన్న దేశాల నుంచి ఎవరికి అనుమతి ఉండదు. చివరికి దౌత్యవేతలు, వైద్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు కూడా అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అంతేకాదు..నిషేధిత జాబితాలో ఉన్న దేశాల మీదుగా సౌదీ చేరుకోవాలనుకునే వారికి నిబంధనలు వర్తిస్తాయని, అయితే..వారు 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉన్న తర్వాత సౌదీకి ప్రయాణం చేయవచ్చని వివరించింది. దౌత్యవేతలు, వైద్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు కూడా నిషేధిత జాబితాలోని దేశాల మీదుగా సౌదీ ప్రయాణం చేయాలనుకుంటే 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి అంటూ వెల్లడించింది. కోవిడ్ ముప్పు నుంచి దేశ ప్రజలను కాపాడుకునేందుకే ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. అయితే..నిషేధిత జాబితాలో ఉన్న దేశాల ప్రజలు..ఇతర దేశాల్లో 14 రోజులు క్వారంటైన్ లో ఉండి సౌదీకి ప్రయాణం చేయవచ్చా అనే దానిపై కింగ్డమ్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.
తాజా వార్తలు
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!







