యూఏఈ:ఉద్యోగులకు జీతం, భాగస్వామ్యులకు గౌరవ వేతనం..
- February 03, 2021
యూఏఈ:ఏదైనా సంస్థ తమ ఉద్యోగులకు జీతాలు పెంచేందుకే ఒకటికి రెండు సార్లు లెక్కలు వేసుకుంటుంది. ఖర్చును తగ్గించుకునేందుకు తర్జనభర్జనలు పడి అవసరం అయితే..ఉద్యోగుల సంఖ్యను కూడా కుదిస్తుంది. ఇక ప్రస్తుత కోవిడ్ సంక్షోభంలో చాలా కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులనే బలి చేస్తున్నాయి.
ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ షార్జాలోని ఓ వ్యాపారి తమ ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం సంచలన నిర్ణయం తీసుకున్నాడు.ఉద్యోగులకు వేతనంతో పాటు ఇక నుంచి వారి భాగస్వామికి కూడా సాధారణ వేతనం చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఆయన మన భారతీయ వ్యాపారవేత్త కావటం విశేషం.పేరు డా.సోహన్ రాయ్.తన ఎరిస్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు,వారి కుటుంబ సభ్యులు కోవిడ్ సమయంలోనూ సంస్థ పట్ల చూపించిన చిత్తశుద్ధికి ఫిదా అయ్యారు సోహన్ రాయ్.అందుకే ప్రతి ఉద్యోగి భాగస్వామిని కూడా గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారాయన.దీనికి సంబంధించి ఇప్పటికే తమ ఉద్యోగుల భాగస్వామ్యుల వివరాలను కంపెనీ వర్గాలు సేకరిస్తున్నాయి. ఒక ఉద్యోగి తమ సంస్థలో ఎన్నాళ్లుగా పని చేస్తున్నాడో...ఆ కాలాన్ని పరిగణలోకి తీసుకొని గౌరవ వేతనం ఎంత ఇవ్వాలనేది నిర్ణయించనున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువరించే అవకాశాలు ఉన్నాయి.అయితే..తమ ప్రకటనలో గృహిణులు అని పేర్కొన్న కంపెనీ వర్గాలు..ఒకవేళ ఉద్యోగి భార్య కూడా మరో ఉద్యోగం చేస్తుంటే గౌరవ వేతనం ఇస్తారా..? లేదా? అనేది మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







