‘బంగార్రాజు’ షూటింగ్ మొదలు పెట్టనున్న నాగార్జున

- February 03, 2021 , by Maagulf
‘బంగార్రాజు’ షూటింగ్ మొదలు పెట్టనున్న నాగార్జున

హైదరాబాద్:నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ‘బంగార్రాజు’ గా నాగ్ అందరిని ఆకట్టుకున్నారు. ఇక ఇదే పాత్ర ఆదారంగా  మరో సినిమాను తెరకెక్కించాలని దర్శకుడు కళ్యాణ్, నాగార్జున భావించారు. ఈ సినిమాకు ‘బంగార్రాజు’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు. కానీ అనేక కారణాలవల్ల ఈ సినిమా సెట్స్ పైకి  వెళ్ళలేదు. ఇదిగో స్టార్ట్ అవుతుంది అదిగో మొదలవుతుంది అంటూ ఆ మధ్య వార్తలు వినిపించాయి. సోగ్గాడే చిన్నినాయనా సినిమా తర్వాత నాగచైతన్య తో ‘రారండోయ్ వేడుక చూదాం’ రవితేజతో ‘నెల టికెట్’ సినిమా చేసాడు కళ్యాణ్. ఇప్పుడు నాగార్జున ‘బంగార్రాజు’ను ఎలాగైన పూర్తి చేయాలని చూస్తున్నాడు.

తాజాగా మరోసారి ఈ సినిమాకు సంబంధించిన వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా షూటింగ్ ను త్వరలోనే మొదలు పెట్టనున్నారట. ఫిబ్రవరి రెండో వారంలో ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టనున్నారని తెలుస్తుంది. శరవేగంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. బంగార్రాజు మూవీ గతేడాది ఉగాదికే ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసాడట దర్శకుడు కళ్యాణ్. ఈ సినిమాలో నాగ్, రమ్యకృష్ణలతో పాటు నాగచైతన్య మరో పాత్రలో నటించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com