‘చెక్’ ట్రైలర్ విడుదల
- February 03, 2021
హైదరాబాద్:చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ నటిస్తున్న చిత్రం చెక్. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ ఖైదీగా నటిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ కీలకమైన లాయర్ పాత్రను పోషించారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ప్రముఖ నటుడు మురళీ శర్మ వాయిస్ తో 'యద్భావం తద్భవతి' అన్న ఉద్బోధతో ట్రైలర్ ప్రారంభమైంది. ఉరిశిక్ష పడిన ఖైదీ నితిన్ చదరంగంతో జైలు నుంచి ఎలా బయట పడ్డాడు అనేది కథాంశంగా ట్రైలర్ బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 26న విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష