మస్కట్:ఇకపై 65 ఏళ్లు దాటిన వృద్ధులకు కూడా కోవిడ్ వ్యాక్సినేషన్

- February 04, 2021 , by Maagulf
మస్కట్:ఇకపై 65 ఏళ్లు దాటిన వృద్ధులకు కూడా కోవిడ్ వ్యాక్సినేషన్

మస్కట్:కోవిడ్ వ్యాక్సినేషన్ లో భాగంగా ఇక 65 ఏళ్లు దాటిన వృద్ధులకు కూడా వ్యాక్సిన్ అందించనుంది ఒమన్ ప్రభుత్వం. ప్రధాన్య క్రమంలో వ్యాక్సిన్ పంపిణీ విడతల వారీగా అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోభాగంగా తొలుత ఫ్రంట్ లైన్ వర్కర్లు, దీర్ఘకాలిక రోగుల, 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు లక్ష్యంగా వ్యాక్సిన్ అందించారు. ఇక ఇప్పుడు 65 ఏళ్లు అంతకుమించి వయసు పైబడిన వారిని లక్ష్యంగా చేసుకొని వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అయితే..తొలి విడతలో లబ్ధిదారుల మెడికల్ కండీషన్ ను పరిగణలోకి తీసుకోగా..ప్రస్తుత దశలో మాత్రం మెడికల్ కండీషన్ తో సంబంధం లేకుండా 65 ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ అందించనున్నారు. ఇదిలాఉంటే..ఇన్నాళ్లుగా తొలి విడతలో ఫైజర్ బయోన్టెక్ టీకా తీసుకున్న వారికి ప్రస్తుత దశలో వ్యాక్సిన్ ఇవ్వబోవటం లేదని స్పష్టం చేసింది. తొలి డోసు తీసుకున్న వారికి రెండో డోసు ఎప్పుడు ఇస్తారనేది ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడిస్తారని కూడా వెల్లడించింది. అయితే..చిన్నారులకు వేసే టీకాలు మినహా ఇతర వ్యాక్సిన్లను బలవంతంగా ఇచ్చే ఉద్దేశం తమకు లేదని..అది చట్టపరంగా కూడా విరుద్ధమని వెల్లడించింది. మరోవైపు ఒమన్ వ్యాప్తంగా ఇప్పటివరకు 40 కేంద్రాల్లో వ్యాక్సిన్ అందిస్తున్నారు. మస్కట్ గవర్నరేట్‌లోని ప్రజల కోసం అల్ సీబ్ స్పెషలిస్ట్ పాలిక్లినిక్, బౌషర్ స్పెషలిస్ట్ పాలిక్లినిక్, కురియాత్ పాలిక్లినిక్ లలో వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com