కోవిడ్ 19న వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్న గురునానక్ దర్బార్ గురుద్వారా

- February 04, 2021 , by Maagulf
కోవిడ్ 19న వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్న గురునానక్ దర్బార్ గురుద్వారా

దుబాయ్: గురునానక్ దర్బార్ గురుద్వారా - దుబాయ్, తమౌహ్ హెల్త్ కేర్ ఎల్ఎల్‌సి ద్వారా ఆన్-సైట్ సినోఫామ్ వ్యాక్సినేషన్‌ను యూఏఈ రెసిడెంట్స్‌కి ఉచితంగా అందించనుంది. ఈ మేరకు సిఖ్ టెంపుల్ మేనేజ్‌మెంట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 6, 7 మరియు 8 తేదీల్లో జబెల్  అలీ లోని గురుద్వారాలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగనుంది. వాట్సాప్ ద్వారా 0506295702, 0566445961 నెంబర్లలో అపాయింట్‌మెంట్లు పొందవచ్చు. ఎమిరేట్స్ ఐడీని రిజిస్ట్రేషన్ కోసం వినియోగించాల్సి వుంటుంది. గురుద్వారాని సందర్శించే వారు తప్పక మాస్కు, గ్లవ్స్ ధరించడంతోపాుట సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com