కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 200 మందికి పైగా ఉల్లంఘనుల గుర్తింపు

- February 04, 2021 , by Maagulf
కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: 200 మందికి పైగా ఉల్లంఘనుల గుర్తింపు

దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా నిబంధనల్ని ఉల్లంఘించిన సుమారు 200 మందికి పైగా వ్యక్తుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగినట్లు తెలుస్తోంది. 216 మందిపై మాస్కులు ధరించలేదనే అభియోగాలు మోపబడ్డాయి. ఆరుగురిపై వాహనంలో పరిమితికి మించి ప్రయాణించడానికి సంబంధించి అభియోగాలు నమోదు చేశారు. ఇప్పటివరకు 9,069 మందిపై మాస్కులు ధరించకపోవడానికి సంబంధించిన కేసులు నమోదయ్యాయి. 293 మందిపై పరిమితికి మించి వాహనంలో ప్రయాణించడానికి సంబంధించిన కేసులు నమోదు చేయడం జరిగింది. కరోనా వైరస్ నేపథ్యంలో మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం సహా పలు నిబంధనల్ని తెరపైకి తెచ్చారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com