6 అక్రమ కట్టడాల కూల్చివేత
- February 25, 2016
సీబ్‌లో 6 అక్రమ కట్టడాల్ని కూల్చివేసినట్లు మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. చట్టబద్ధమైన డాక్యుమెంట్లను చూపించకుండా ఆక్రమించుకున్న భూముల్లో నిర్మాణాలకు యత్నిస్తున్నందున వాటిని కూల్చివేసినట్లు అధికారులు చెప్పారు. మొత్తం 10 నిర్మాణంలో వున్న భవనాల్ని అక్రమ కట్టడాలుగా మునిసిపాలిటీ గుర్తించింది. వీటిలో 6 భవనాల్ని కూల్చివేయగా, మిగిలిన నాలుగు భవనాల విషయంలోనూ అతి త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సీబ్‌లో మొత్తం 161 భవనాల్ని అక్రమ భవనాలుగా గుర్తించి, అందులో 90 భవనాల్ని ఇప్పటికే కూల్చివేశారు. రాయల్ ఒమన్ పోలీసు, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ సహకారంతో మస్కట్ మునిసిపాలిటీ ఈ చర్యలు చేపట్టింది. ఫెన్స్‌లతోనూ, తాత్కాలిక నిర్మాణాలతోనూ, షీప్ షెల్టర్స్‌తోనూ వీటిని నిర్మించారు. అలాగే అక్రమంగా ఓ బావిని కూడా స్టేట్ ఓన్డ్ భూమిలో ఏర్పాటు చేశారు. ఇలాంటి వాటిల్లో వలసదారులకు అక్రమంగా అద్దెలకు ఇస్తున్నారని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







