‘శశి’ సెకండ్ సాంగ్.. ఆకట్టుకుంటున్న అందమైన పాట..
- February 05, 2021
హైదరాబాద్:ఆది సాయికుమార్ హీరోగా శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘శశి’.సురభి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. లవ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. చిత్రాన్ని ఫిబ్రవరి 12న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఒకే ఒక లోకం నువ్వు అంటూ సాగే పాట సంచలనం సృష్టిస్తున్న విషయం తేలిసిందే. సంగీత ప్రేమికులను ఈ పాట ఉలలాడిస్తుంది. మిలియల్ వ్యూస్ తో, లైక్స్ తో దూసుకుపోతుంది ఈ పాట. ఇక ఇప్పుడు ఈ సినిమానుంచి సెంకడ్ సాంగ్ ను విడుదలచేసారు. ధీంతానా… ధీంతానా అంటూ సాగే పాటను సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్ చేతుల మీదుగా లాంచ్ చేసారు. అందమైన లిరిక్స్ తో సాగిన ఈపాట ఆకట్టుకుంటుంది. ఇక చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆది ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని కసిగా ఉన్నాడు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు