విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు:చంద్రబాబు
- February 06, 2021
అమరావతి:విశాఖ ఉక్కు ఆంధ్రుల శాశ్వత హక్కు అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయాలని చూస్తే మరో ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు. లక్షలాదిమంది ఏళ్లతరబడి ఉద్యమించి, 32మంది ప్రాణ త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నామన్నారు. ఇలాంటిదాన్ని జనాన్ని ఏమార్చి లక్షల కోట్లను కొట్టెద్దామనుకుంటున్న వైసీపీ గ్యాంగ్ కుతంత్రాన్ని ప్రజల మద్దతుతో అడ్డుకుంటామని ట్వీట్ చేశారు. అభివృద్ది వికేంద్రీకరణకే విశాఖలో పరిపాలనఅన్న జగన్మోహన్ రెడ్డి.. ఇప్పటికే అక్కడి కొండలు కొట్టేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు ఉక్కుపై పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. 18వేల శాశ్వత ఉద్యోగులు, 22 వేల కాంట్రాక్ట్ ఉద్యోగులు.. పరోక్షంగా లక్ష మందికి ఉపాధి కల్పించే విశాఖ ఉక్కును ప్రైవేటు పరంచేస్తుంటే సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









