విమానం టైర్ల వద్ద వేలాడుతూ గంటసేపు ప్రయాణం...

- February 07, 2021 , by Maagulf
విమానం టైర్ల వద్ద వేలాడుతూ గంటసేపు ప్రయాణం...

నైరోబి:విమానంలో ప్రయాణం అంటే.. సీట్లో కూర్చొని సీట్‌ బెల్టు పెట్టుకోవడం.. సురక్షితంగా గమ్యాన్ని చేరడం.. ఇవి మాత్రమే మనకు తెలుసు. కెన్యాకు చెందిన ఓ 16 ఏళ్ల బుడతడు మాత్రం పెద్ద సాహసం చేశాడు.. ఎందుకంటే.. విమానం చక్రాల దగ్గర ఉండే ల్యాండింగ్‌ గేర్‌ పట్టుకుని ఏకంగా గంటసేపు ఆ బుడతడు ప్రయాణించి.. లండన్‌ నుంచి నెదర్లాండ్స్‌లోని హాలెండ్‌కు చేరుకున్నాడు. ఇది మామూలు ప్రయాణం కాదండోరు.. ఉత్తర సముద్రానికి పైన 19,000 అడుగులో ఎత్తులో.. ఎముకలు గడ్డ కట్టుకుపోయే అతిశీతల వాతావరణం గుండా ఈ విమానం వచ్చింది.

స్టోఅవే..
  ఇలాంటి అసాధారణ సాహస కార్యాలకు పాల్పడేవారిని స్టోఅవే అని అంటుంటారు. సాధారణంగా వీరంతా మార్గ మధ్యలో జారిపడి మరణిస్తుంటారు. కానీ అదఅష్టవశాత్తు కెన్యా బాలుడు సురక్షితంగా దిగాడు.

బాలుడిని చూసి అవాక్కయిన అధికారులు..
  ఇంగ్లండ్‌లోని స్టాన్‌స్టెడ్‌ విమానాశ్రయం నుంచి టర్కీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన సరకు రవాణా విమానం దక్షిణ నెదర్లాండ్స్‌లోని మాస్ట్రిక్ట్‌ విమానాశ్రయానికి వచ్చింది. అనంతరం విమానం టైర్ల దగ్గర 16 ఏళ్ల బాలుడు ఉండటాన్ని అధికారులు గుర్తించారు. ఉత్తర సముద్రం మీదుగా ఈ విమానం 19,000 అడుగులో ఎత్తులో, మార్గ మధ్యలో విపరీతమైన అతి శీతల వాతావరణం ఉన్నప్పటికీ బాలుడు జీవించి ఉండటాన్ని చూసి అవాక్కయ్యారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో హైపోథెర్మియాకు చికిత్స పొందుతున్నట్లు నెదర్లాండ్స్‌ పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com