BPNLలో ఉద్యోగావకాశాలు
- February 08, 2021
భారతీయ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ (BPNL) భారత దేశవ్యాప్తంగా భారీ నియామక ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా వివిధ విభాగాల్లో 3216 ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15 దరఖాస్తుకు చివరి తేదీ. మరిన్ని వివరాలకు https://www.bharatiyapashupalan.com వెబ్సైట్ చూడొచ్చు.
మొత్తం పోస్టులు: 3216 సేల్స్ మేనేజర్: 64 సేల్స్ డెవలప్మెంట్ ఆఫీసర్: 485 సేల్స్ హెల్పర్: 2667 ముఖ్య సమాచారం: అర్హత: సేల్స్ మేనేజర్ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సేల్స్ డెవలప్మెంట్ పోస్టులకు ఇంటర, సేల్స్ హెల్పర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. వయసు: సేల్స్ మేనేజర్ పోస్టులకు 25 నుంచి 45 ఏళ్లలోపు.. మిగిలిన పోస్టులకు 21 నుంచి 40 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఎఫిసియెన్సీ టెస్ట్. ఇందులో అర్హత సాధించిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్కు పిలుస్తారు. అనంతరం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 15, 2021.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







