ఒమన్ : 24 గంటల్లోనే 2000 మందికి వ్యాక్సినేషన్
- February 09, 2021
మస్కట్:ఒమన్ ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత ముమ్మరం చేస్తోంది. ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం ప్రాధాన్య వర్గాల క్రమంలో వ్యాక్సిన్ అందిస్తుంది.
తొలుత ఫైజర్ వ్యాక్సిన్ వేసిన ఒమన్..దేశ ప్రజలు అందరికీ వ్యాక్సిన్ అందించే లక్ష్యంతో భారత ఉత్పతి వ్యాక్సిన్ అస్ట్రాజెనెకాను కూడా అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసింది. గత 24 గంటల్లో సుల్తానేట్ లో 2 వేలకు పైగా ప్రజలకు ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ టీకాలు వేయించారు. ఇది నిర్దేశించుకున్న సంఖ్యలో3 శాతం. ఇక గవర్నరేట్ల వారీగా చూసుకుంటే గడిచిన 24 గంటల్లో 875 మందికి వ్యాక్సిన్ వేసి మస్కట్ గవర్నరేట్ తొలి స్థానంలో ఉంది. 315 మందికి టీకాలతో నార్త్ అల్ బటినా గవర్నరేట్ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుస క్రమంలో అల్-దఖిలియా గవర్నరేట్ 267, అల్-ధహిరా గవర్నరేట్ 176, నార్త్ అల్ షార్కియా గవర్నరేట్ 133, అల్ షార్కియా సౌత్ గవర్నరేట్ 132, ధోఫర్ గవర్నరేట్ 36, అల్-బురైమి పరిధిలో 34 మందికి వ్యాక్సిన్ వేశారు.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







