27 రోజుల్లో 9,271 మంది ప్రవాసీయుల వర్క్ పర్లిట్లు రద్దు చేసిన కువైట్
- February 09, 2021
కువైట్ సిటీ :ప్రవాస కార్మికులకు షాక్ ఇచ్చింది కువైట్ ప్రభుత్వం. కేవలం 27 రోజుల వ్యవధిలో ఏకంగా 9,271 మంది ప్రవాసీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేసింది. అదే సమయంలో 362 మందికి కొత్తగా వర్క్ పర్మిట్లను జారీ చేసినట్లు మానవ వనరుల అధికార విభాగం తమ తాజా గణాంకాల్లో వెల్లడించింది. రద్దు చేసిన వర్క్ పర్మిట్లలో 4999 మంది ప్రస్తుతం కువైట్లో లేరని తెలిపింది. అయితే..అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలతో వాళ్లంత ఇతర దేశాల్లో చిక్కుకుపోయి కువైట్ రాలేదు. అలా విదేశాల్లో ఉండిపోయి..రెసిడెన్సీ వీసాల గడువు ముగిసిన వారి వర్క్ పర్మిట్లు రద్దు చేసినట్లు వివరించింది. 555 మంది వలస కార్మికులు మృతి చెందారని, దేశం విడిచి వెళ్లిన 3,534 మంది వలస కార్మికులు వర్క్ పర్మిట్లను రద్దు చేసినట్లు తెలిపారు. మరో 183 మంది తమ వీసాలను ఫ్యామిలీ వీసాలుగా బదిలీ చేసుకున్నట్లు మానవ వనరుల శాఖ వివరించింది. ఇదిలాఉంటే..గత నెల 24 నుంచి కొత్త వర్క్ పర్మిట్లను జారీ చేయటం ప్రారంభించిన కువైట్ ఇప్పటివరకు 362 మంది పర్మిట్లను జారీ చేసిందని..అయితే, అవన్ని మంత్రి మండలి ఆమోదం తర్వాతే అనుమతించినవని ప్రకటించింది.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







