ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్..ఇండియాలో నేరుగా కంపెనీ ఏర్పాటుకు లైన్ క్లియర్
- February 09, 2021
2021-22 వార్షిక బడ్జెట్ లో విదేశీ పెట్టుబడులకు రూట్ క్లియర్ చేసిన కేంద్రం..ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్ అందించింది.గల్ఫ్ దేశాల్లో ఉండున్న ఎన్ఆర్ఐలు వచ్చే ఏప్రిల్ నుంచి నుంచి ఇండియాలో సొంతంగా కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు.గతంలో ఎన్ఆర్ఐలకు ఈ వెసులుబాటు లేదు. ఈ మేరకు కంపెనీస్ ఇన్కార్పోరేషన్ చట్టాన్ని సవరించి వన్ పర్సన్ కంపెనీస్ కు మార్గం సుగమమం చేసినట్లు అంతర్గత వాణిజ్యం, పారిశ్రామిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి గురుప్రసాద్ వెల్లడించారు.అంతేకాదు..ఎన్ఆర్ఐ పెట్టుబడులతో పరోక్షంగా ఏర్పాటు చేసిన కంపెనీలు లిమిటెడ్ కంపెనీలుగా మారటానికి గతంలో రెండు సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చేది. అలాగే మూలధనం వ్యయం 50 లక్షలు దాటినా వార్షిక టర్నోవర్ 2 కోట్ల రూపాయలకు చేరినా పరిమితులు ఉండేవి. కానీ, ఇప్పుడు ఆ అవరోధకాలు కూడా లేవు. ఎన్ఆర్ఐ తన సొంతంగా కంపెనీ ఏర్పాటు చేసుకోవటంతో పాటు లిమిటెడ్ కంపెనీగా మార్చుకునేందుకు గతంలో మాదిరిగా రెండేళ్లు వేచి చూడాల్సిన అవసరం లేదు. అలాగే మూలధన వ్యయం, వార్షిక టర్నోవర్ పై ఎలాంటి పరిమితులు లేవు. అలాగే ఎన్ఆర్ఐలు ఇండియాలో ఉండాల్సిన సమయాన్ని 182 నుంచి 120 రోజులకు కుదించింది. దీంతో వన్ పర్సన్ కంపెనీస్ పెరిగే అవకాశాలు ఉన్నాయని గురుప్రసాద్ వెల్లడించారు. గ్లోబల్ మీడియా డేటా మేరకు ఒక్క సౌదీ అరేబియాలోనే 15 లక్షల మంది ఎన్ఆర్ఐలు ఉన్నారని, భారత ప్రభుత్వం ఓపీసీల ప్రొత్సాహానికి ప్రకటించిన అవకాశాన్ని ఆసక్తిగల పారిశ్రామికవేత్తలు వినియోగించుకుంటారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ వాస్తవ GDPలో 56% నాన్ ఆయిల్ సెక్టర్ దే..!!
- ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్టు..!!
- యూఏఈలో గీత దాటిన టీచర్లపై 'క్రమశిక్షణా' చర్యలు..!!
- కువైట్ ఇంటర్నెట్ మార్కెట్లో మొబైల్ రూటర్ల ఆధిపత్యం..!!
- కోస్ట్ గార్డ్ పెట్రోల్ తో ఫిషింగ్ బోట్ ఢీ..!!
- గాజాలో కాల్పుల విరమణ.. తదుపరి దశలపై కైరోలో చర్చలు..!!
- కొత్త మోసాల పై యూజర్లకు హెచ్చరిక
- ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు
- డాలస్ లో ప్రవాస భారతీయ అవగాహనా సదస్సు...







