ఫేక్ కరెన్సీ: రియాద్‌లో నలుగురి అరెస్ట్

- February 09, 2021 , by Maagulf
ఫేక్ కరెన్సీ: రియాద్‌లో నలుగురి అరెస్ట్

రియాద్‌లో నలుగురు వ్యక్తుల్ని ఫేక్ కరెన్సీతో డీల్ చేస్తున్న కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల్లో ముగ్గరు సౌదీలు కాగా, మరొకరు సుడానీస్ వ్యక్తి. రియాద్ పోలీస్ అధికార ప్రతినిథి మేజర్ ఖాలెద్ అల్ క్రీడిస్ ఈ విషయాల్ని వెల్లడించారు. ఓ హౌసింగ్ యూనిట్‌లో నిందితుల్ని అరెస్టు చేశామనీ, వారి నుంచి ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామనీ ఆయన వివరించారు. నిందితులకు కస్టడీ విధించడం జరిగిందనీ, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com