షర్మిల కొత్త పార్టీ పై కేసీఆర్ స్పందన
- February 09, 2021
హైదరాబాద్:తెలంగాణలో కొత్త పార్టీ అనే విషయం మీద కేసీ ఆర్ మొన్నటి సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలను కొందరు గుర్తు చేస్తున్నారు. మొన్న కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ సీఎం మార్పు ఊహాగానాలకు కేసీఆర్ తెరదించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని.. మరో పదేళ్లూ తానే ముఖ్యమంత్రినని స్పష్టం చేశారు. అంతేకాక సీఎం మార్పు గురించి ఎవరైనా మాట్లాడితే... కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఆ తరువాత ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ పెట్టడం అంత ఈజీ కాదని అన్నారు. పార్టీ అంటే పాటలు పాడటం.. పాన్ షాప్ పెట్టడం కాదంటూ ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అది షర్మిల పార్టీ గురించేనా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొత్త పార్టీ ఏర్పాటు చేయాలంటే దానికి బలమైన నిర్మాణం కావాలని పార్టీ ముందుకెళ్లడానికి తగిన వ్యూహం కూడా ఉండాలన్నారు. అంతే కాక గత 20 ఏళ్లలో 14 పార్టీలు వచ్చిపోయిన సంగతిని కూడా కేసీఆర్ సమావేశంలో పేర్కొన్నారు. దేవేందర్‌గౌడ్, విజయ శాంతి, చిరంజీవి, జయప్రకాశ్ నారాయణ, కోదండరాం లాంటి వాళ్లు పార్టీలు పెట్టినా.. వాటి ఆనవాళ్లు లేవన్నారు. చెన్నారెడ్డి లాంటి నేత తెలంగాణ ప్రజాసమితిని ఏర్పాటు చేసి 11 ఎంపీ స్థానాలు గెలిచినా.. ఇందిరాగాంధీ ధాటికి తట్టుకోలేకపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు కేసీ ఆర్ వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్‌లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్‌లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్