గల్ఫ్ వెళ్తున్నారా? జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్న కమీషనర్ మహేష్ భగవత్
- February 09, 2021
హైదరాబాద్:గల్ఫ్ దేశాలకు తెలంగాణ,ఏపీ రాష్ట్రాల నుండి చాలా మంది పని కోసం వెళ్తున్నారని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. గ్రామాల్లో కొంతమంది ఏజెన్సీలుగా ఏర్పడి మహిళలను ఇతర దేశాలకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు.విజిట్ వీసా మీద ఇతర దేశాలకు పంపిస్తారు..విజిట్ వీసా అయిపోయిన తర్వాత వారిని జైల్లో పెట్టి అనంతరం వారిని విడిపించి వ్యబిచార గృహాలకు తరలిస్తున్నారని తెలిపారు.మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఖాదర్ బి అనే మహిళను ఒమన్ దేశానికి వెళ్ళడానికి సిద్ధం చేశారు.
ఒమన్ దేశానికి వెళ్లాలంటే ఏజెంట్ తో ఒకరు గడపాలని షరతులు పెట్టారు..దింతో అనుమానం వచ్చిన మహిళ పోలీసులకు సమాచారం అందించింది.. వారిపై దాడి చేసి ముఠా ను అరెస్ట్ చేసాం..ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసాం..మరో ముగ్గురు నిందితులు పరారీ లో ఉన్నారు..నిందితుల వద్ద నుండి 40 ఇండియా పాస్ పోర్టులు, 4 మొబైల్ ఫోన్స్, 6 వేల నగదు స్వాధీనం చేసుకున్నాము.

నిందితులందరు కడప,హైదరాబాద్ కు చెందిన వారు.తెలంగాణ,ఏపీ రాష్టాల నుండి మహిళల ను ట్రాప్ చేసి వారికి డబ్బు ఆశ చూపించి ఇతర దేశాల్లో ఉండే వారికి అమ్ముతారు. అరబ్ దేశాలకు ఎక్కువగా మహిళలు అమ్ముతారు..ఇతర దేశాలకు పంపిస్తామని ఏజెంట్లు ఎవ్వరైనా వచ్చి ఇబ్బందులు పెడితే మాకు సమాచారం అందించాలని మహేష్ భగవత్ వ్యాఖ్యానించారు.


తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







