వంగవీటి లోగో విడుదల...

- February 25, 2016 , by Maagulf
వంగవీటి లోగో విడుదల...

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వంగవీటి రంగా, వంగవీటి రాధ జీవిత నేపధ్యంతో వంగవీటి అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు . ఈ చిత్రం ఎనౌన్స్ చేసినప్పటి నుండి వర్మకు బెదిరింపు కాల్స్ రావడం, దీనిపై వర్మ వివరణ ఇవ్వడం జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల వంగవీటి రంగాకు సంబంధించిన ఓ లుక్‌ని కూడా రిలీజ్ చేసారు. బెజవాడ రాజకీయాల నేపధ్యంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా, చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.వంగవీటి చిత్రాన్ని తెరకెక్కించొద్దని పలువరు వర్మకు హెచ్చరికలు చేసిన కూడా అవేమి పట్టించుకోకుండా, తన చిత్ర టైటిల్ లోగోను వర్మ తన ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసాడు. సైకిల్ చైన్‌తో వంగవీటి లోని అక్షరాలను కలుపుతూ ఈ పోస్టర్‌ను క్రియేట్ చేయగా ఇందులో కత్తి, ఎర్ర జెండా కూడా ఉన్నాయి.ప్రస్తుతం ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు వర్మ సన్నాహాలు చేస్తుండగా, దీని తర్వాత సుదీప్ టైటిల్ రోల్‌లో రాయ్ అనే చిత్రాన్ని చిత్రీకరించనున్నారు రామ్ గోపాల్ వర్మ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com