‘నాట్యం’ టీజర్ విడుదల చేసిన ఎన్టీఆర్

- February 10, 2021 , by Maagulf
‘నాట్యం’ టీజర్ విడుదల చేసిన ఎన్టీఆర్

ప్ర‌ముఖ కూచిపూడి నృత్య‌కారిణి సంధ్య‌రాజు లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న చిత్రం ‘నాట్యం’. నిశృంక‌ల ఫిల్స్మ్ బ్యాన‌ర్ పై నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని రేవంత్ కోరుకొండ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు.టైటిల్ కు తగ్గట్టుగానే పూర్తిగా ‘నాట్యం’ తో రొమాంటిక్ గా రన్ అయింది టీజర్.ఈ చిత్రానికి ఎన్టీఆర్ వాయిస్ ఓవ‌ర్ అందించనున్నట్లుగా తెలుస్తోంది.క‌మ‌ల్‌కామ‌రాజు, రోహిత్ బెహ‌ల్, భానుప్రియ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.శ్ర‌వ‌న్ భ‌ర‌ద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.లీడ్ రోల్‌లో న‌టిస్తోన్న సంధ్య‌రాజు, స‌త్యం కంప్యూట‌ర్స్ స‌ర్వీసెస్ ఫౌండ‌ర్ బీ రామ‌లింగ‌రాజు కోడ‌లు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com