ఆస్కార్ రేసు నుంచి జల్లికట్టు ఔట్..
- February 10, 2021
93వ ఆస్కార్స్‌కు ఇండియా నుంచి అధికారిక ఎంట్రీ అయిన మలయాళ మూవీ జల్లికట్టు ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి షార్ట్‌లిస్ట్ కాలేకపోయింది. మరోవైపు కరిష్మా దేవ్ దూబె దర్శకత్వం వహించిన బిట్టూ మాత్రం లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీకి షార్ట్‌లిస్ట్ కావడం విశేషం. అకాడమీ బుధవారం 9 కేటగిరీలకు చెందిన షార్ట్‌లిస్ట్‌లను ప్రకటించింది. ఈ కేటగిరీల్లో ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఒరిజినల్ స్కోర్, ఒరిజినల్ సాంగ్, మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్, విజువల్ ఎఫెక్ట్స్, లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్, ఆనిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలకు షార్ట్‌లిస్ట్‌లను ప్రకటించారు. ఈ లిస్ట్‌ల నుంచి అకాడమీ ఇప్పుడు ఆస్కార్స్ 2021కు నామినీలను ఎంపిక చేస్తుంది.
అయితే ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీకి ఇండియా నుంచి అధికారిక ఎంట్రీగా వెళ్లిన జల్లికట్టు షార్ట్‌లిస్ట్ అయిన 15 సినిమాల జాబితాలో చోటు దక్కించుకోలేకపోయింది. ఈసారి 93 దేశాల నుంచి సినిమాలు ఈ కేటగిరీకి అర్హత సాధించడం విశేషం. ఆస్కార్స్ చరిత్రలో ఇదే అత్యధికం. మరోవైపు ఇండియాకే చెందిన బిట్టూ మాత్రం టాప్ 10 షార్ట్ ఫిల్మ్స్ లిస్ట్‌లో చోటు సంపాదించింది. ఇద్దరు స్కూలు విద్యార్థుల మధ్య ఉన్న స్నేహంపై తీసిన ఈ షార్ట్‌ఫిల్మ్ ఒక నిజమైన స్టోరీ కావడం విశేషం. మార్చి 15న ఆస్కార్స్‌కు నామినేషన్లు ప్రకటించనున్నారు. ఏప్రిల్ 25న బహుమతుల ప్రదానోత్సవం ఉంటుంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







