దోహాకు భారీగా డ్రగ్స్ తరలిస్తుండగా పట్టివేత..
- February 10, 2021
చెన్నై:చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. మంగళవారం నిందితుల నుంచి రూ.5.1కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొని.. ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.నిందితులు ఎయిర్ కార్గోలో చెన్నై నుంచి దోహాకు రవాణా చేస్తున్నారు.ఈ క్రమంలో కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించగా.. వేయింగ్ మిషన్ ద్వారా 44 కిలోల మెథాంఫేటమిన్ క్రిస్టల్స్, మాదకద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారు.44 కేజీలున్న దీనివిలువ 5.1కోట్లు ఉంటుందని, ఇద్దరిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో వారం రోజుల వ్యవధిలోనే రెండోసారి డ్రగ్స్‌ను భారీగా పట్టుకున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







