‘దృశ్యం-2’ రీమేక్ కు వెంకటేష్ అందుకే దూరం
- February 10, 2021
మలయాళి స్టార్ మోహన్‌లాల్, మీనా, అన్సిబా, ఎస్తేర్, సాయికుమార్ కీలకపాత్రలు పోషించిన చిత్రం ‘దృశ్యం’. 2013 విడుదలైన చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ రీమేక్ చేయగా.. ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. చైనీస్ భాషలోకి రీమేక్ అయిన తొలి భారతీయ సినిమాగా కూడా నిలిచింది. కుటుంబ విలువలు, మర్డర్ మిస్టరీ అంశాల కలబోతగా రూపొందిన చిత్రం అందరినీ మెప్పించింది. ప్రస్తుతం దృశ్యం చిత్రానికి సీక్వెల్‌గా ‘దృశ్యం-2’ను జీతూ జోసెఫ్ తెరక్కించారు. ఈ చిత్రం ఈ నెల 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. దృశ్యం తెలుగు రీమేక్‌లో చిత్రంలో మోహన్‌లాల్ పోషించిన పాత్రను వెంకటేశ్ పోషించగా.. సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం మోహన్‌లాల్ నటించిన దృశ్యం-2పై భారీగా అంచనాలున్నాయి. మళ్లీ తెలుగు రీమేక్‌లో వెంకటేశ్ ప్రధాన పాత్ర పోషిస్తారని టాలీవుడ్లో ఊహాగానాలున్నాయి. ఇటీవల నిర్మాత సురేష్‌బాబు ఈ విషయాన్ని వెంకటేశ్ దృష్టికి తీసుకువెళితే ఈ ప్రాజెక్టుకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే చిత్రం థియేటర్లలో కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫాంలో విడుదలవుతుండడంపై రీమేక్‌పై ఆసక్తి చూపడం లేదని టాక్. సినీ ప్రేమికులు, అభిమానులకు చిత్రంపై ఎలాంటి ఉత్సుకత ఉండదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంతోనే రీమేక్‌కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వెంకటేశ్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప చిత్రంలో నటిస్తున్నారు. తమిళ బ్లాక్ బాస్టర్ ‘అసురన్’కు రీమేక్ ఇది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు