కొన్ని ఖాతాలను రద్దు చేయలేం..ట్విటర్
- February 10, 2021
న్యూఢిల్లీ:ట్విటర్ భారత ప్రభుత్వ ఆదేశాలను పాక్షికంగా అమలు చేసింది. రైతుల ఆందోళనలపై తప్పుడు ప్రచారం చేస్తున్న పాకిస్థాన్, ఖలిస్తాన్‌కు చెందిన 1178 ట్విటర్ ఖాతాలను బ్లాక్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించగా.. ట్విటర్ మాత్రం వాటిలో కొన్నింటినే బ్లాక్ చేసినట్లు బుధవారం వెల్లడించింది. అది కూడా కేవలం ఇండియా వరకు మాత్రమే పరిమితమని, ఇతర దేశాల్లో ఆ అకౌంట్లు పని చేస్తాయని తెలిపింది.
ఇక తాము మీడియా, జర్నలిస్టులు, ఉద్యమకారులు, రాజకీయ నాయకుల ఖాతాల జోలికి వెళ్లలేదని, అది భారత చట్టాల ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించడమే అవుతుందని ట్విటర్ స్పష్టం చేసింది.గళాలు స్వేచ్ఛగా తమ వాదన వినిపించడానికి తమ మైక్రోబ్లాగింగ్ ఉన్నదని, ఎవరైనా ఎలాంటి అభిప్రాయాలైనా వ్యక్తం చేసేలా తాము మరింత మెరుగైన సేవలు అందిస్తామని తెలిపింది.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ







