రెడ్లిస్ట్ను విడుదల చేసిన బ్రిటన్ వైద్య, ఆరోగ్య శాఖ
- February 10, 2021
లండన్: కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న ‘రెడ్ లిస్ట్’లోని దేశాల నుంచి బ్రిటన్‌లో అడుగుపెట్టే ప్రయాణికులకు నిబంధనలను బ్రిటన్ కఠినతరం చేసింది.ఈ క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 10వేల పౌండ్ల వరకు జరిమానా ఉంటుందని బ్రిటన్ ప్రకటించింది.
అంతేకాదు పదేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు హెచ్చరించింది.ఈ నిబంధనలు వచ్చే సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని బ్రిటన్ వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్ హాన్కాక్ వెల్లడించారు . కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా.. తమ దేశంలోకి వచ్చే ప్రయాణికులకు నూతన క్వారంటైన్ నిబంధనలను నిర్దేశించింది బ్రిటన్ ప్రభుత్వం.
బ్రిటన్‌కు వచ్చిన ప్రయాణికులు ప్రభుత్వం సూచించిన హోటల్లో 10రోజులు క్వారంటైన్లో ఉండాలని తన ప్రకటనలో పేర్కొన్నారు.సంబంధిత హోటల్‌ను 1750 పౌండ్స్‌తో ముందుగానే బుక్ చేసుకోవచ్చన్నారు.రెడ్‌లిస్ట్‌లో 33 దేశాలు ఉన్నాయి.వీటిల్లోని ఎక్కువ ప్రాంతాలు దక్షిణాఫ్రికా, యూఏఈ, దక్షిణ అమెరికాలోనే ఉన్నాయి. భారత్ రెడ్ లిస్ట్‌లో లేదు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో ఘనంగా సాంస్కృతిక నిధి సమీకరణ కార్యక్రమం
- రైల్వే శాఖ కీలక నిర్ణయం...
- శంకర నేత్రాలయ USA ఆధ్వర్యంలో ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు
- వయనాడులో పబ్లిక్ అకౌంట్స్ కమిటి సమావేశంలో పాల్గొన్న ఎంపీ బాలశౌరి
- వైఎస్ జగన్‌కు అస్వస్థత.. పులివెందుల కార్యక్రమాల రద్దు
- ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం, ఫ్లూ షాట్ డ్రైవ్
- ఏపీ ప్రభుత్వం మరో బిగ్ డెసీషన్..
- విబిజీ రామ్జీతో గ్రామాల్లో నవశకం: ఎంపీ డి.కె అరుణ
- రాచకొండ సుధీర్ బాబుకు అదనపు డిజిగా పదోన్నతి







