రైల్వే శాఖ కీలక నిర్ణయం...
- December 24, 2025
న్యూ ఢిల్లీ: భారతీయ రైల్వే అటవీ జంతువుల రక్షణ దిశగా మరో కీలకమైన ముందడుగు వేసింది. అడవుల గుండా వెళ్లే రైల్వే ట్రాక్ ల పై తరచూ జరుగుతున్న జంతు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం పర్యావరణ పరిరక్షణతో పాటు వన్యప్రాణుల భద్రతకు ఎంతో ఉపయోగపడనుంది.
ఈ ఏఐ కెమెరాలు ట్రాక్‌పై జంతువులు ఉంటే లోకో పైలట్లకు 0.5 కిలోమీటర్ల దూరంలోనే సమాచారం అందిస్తాయి. ఇటీవల నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే సెక్షన్లో 141 కిలోమీటర్ల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ (ఐడీఎస్) విజయవంతమైంది. దీంతో దేశవ్యాప్తంగా మరో 981 కిలోమీటర్ల మేర ఈ కెమెరాలను అమర్చాలని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- Passing of Bharati Mataji
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో రెస్టారెంట్, ఫుడ్ గోడౌన్ సీజ్..!!
- బహ్రెయిన్‌లో మనీలాండరింగ్.. నలుగురు ఆసియన్లకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ







