జూన్ 18 నుంచి రమదాన్: షార్జా ప్లానెటోరియం
- May 29, 2015
పవిత్ర రమదాన్ మాసం జూన్ 18వ తేదీ నుంచి మొదలు కావచ్చని అంచనా వేసింది షార్జా ప్లానెటోరియం.ఖగోళ లెక్కల ప్రకారం ఈ నిర్ణయానికి వచ్చినట్లు షార్జా ప్లానిటోరియం వెల్లడించింది.శుక్రవారం, జులై 17న ఈద్ ఉల్ ఫితర్ ఉండొచ్చని షార్జా ప్లానెటోరియం జనరల్ సూపర్‌వైజర్ అల్ జర్వామ్ చెప్పారని అధికారిక సంస్థ ‘డబ్ల్యుఎఎమ్’ ప్రకటించింది.అయితే ఈసారి రమదాన్ మాసంలో పగలు సమయం ఎక్కువగా ఉండనుంది.అత్యధికంగా పగలు 13 గంటల 45 నిమిషాల సేపు ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఉపవాస సమయాన్ని 15 గంటల 15 నిమిషాలుగా అంచనా వేశారు. అత్యధికంగా 41 డిగ్రీల సెంటీగ్రేడ్, అత్యల్పంగా 26 డిగ్రీల సెంటీగ్రేడ్ రమదాన్ మాసంలో ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయట.హ్యుమిడిటీ 82 మరియు 34 శాతంగా నమోదవనున్నాయని అల్ జర్వాన్ చెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







