శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మళ్ళి బంగారం పట్టివేత
- May 29, 2015
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు నాలుగు కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శనివారం మస్కాట్ నుంచి హైదరాబాద్ నగరానికి చేరుకున్న విమానంలోని బాత్ రూం లో నాలుగు కేజీల బంగారాన్ని విమాన సిబ్బంది గమనించి... అనంతరం డీఆర్ఐ అధికారులకు వారు సమాచారం అందించారు. డీఆర్ఐ అధికారులు బాత్ రూం లోని బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. తనిఖీల్లో బంగారం పట్టుబడుతుందని భావించిన ప్రయాణికుడు భయపడి బాత్ రూం లో వదిలేసి వెళ్లి ఉంటాడని డీఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మే 26వ తేదీన దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 8 కేజీల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని విచారించగా... బంగారం అక్రమ రవాణాకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సహకరిస్తున్న ఇద్దరు జీఎమ్ఆర్ ఉద్యోగుల పేర్లు వెళ్లడించాడు. దాంతో వారిని డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







