ముక్కు ద్వారా టీకా.. క్లినికల్ పరీక్షలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- February 11, 2021
న్యూఢిల్లీ:కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీ కోసం భారత్ బయోటెక్ మరో టీకాను అభివృద్ధి చేసింది.ఇప్పుడీ టీకాకు క్లినికల్ పరీక్షల కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, గ్రీన్ సిగ్నల్ లభించింది. పూర్తిస్థాయి చర్చల అనంతరం నాజల్ టీకా క్లినికల్ పరీక్షలకు అనుమతి ఇస్తున్నట్టు కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) నిపుణుల కమిటీ (ఎస్‌ఈసీ) పేర్కొంది.నిబంధనల మేరకు 75 మంది వలంటీర్లపై పరీక్షలు నిర్వహించి సేఫ్టీఇమ్యునోజెనిసిటీ సమచారాన్ని సేకరించాలని నిపుణుల కమిటీ సూచించింది.
నాజల్ టీకా అభివృద్ధి కోసం భారత్ బయోటెక్ గతేడాది సెప్టెంబరులో అమెరికాలోని వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్సెయింట్ లూయిస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.ఈ టీకా కనుక అందుబాటులోకి వస్తే అమెరికా, జపాన్, ఐరోపా దేశాలు మినహా మిగిలిన దేశాల్లో విక్రయించే హక్కులు భారత్ బయోటెక్‌కు ఉంటాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







