ప్రవాసీయులకు నాణ్యమైన సేవలు అందించేందుకు తవాసుల్ సర్వీస్ ప్రారంభం
- February 11, 2021
రియాద్:పాస్ పోర్ట్ డైరెక్టరేట్ కార్యాలయం-జావాజత్ తమ సేవల్లో మరింత నాణ్యత పెంచేందుకుగాను తవాసుల్ సర్వీస్ ను ప్రారంభించినట్లు వెల్లడించింది.ముఖీమ్ పోర్టల్ లో భాగంగా తవాసుల్ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు జావాజత్ అధికారులు వివరించారు. దీనిద్వారా ప్రవాసీయులు అధిక ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయన్నారు. వినియోగదారులు తమ పొందాలనుకుంటున్న సేవలకు సంబంధించి సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకున్నా..ఇంకా పని పూర్తికాకుంటే తవాసుల్ సర్వీస్ ద్వారా ఆయా దరఖాస్తులు వేగంగా పరిష్కరించేలా కృషి జరుగుతుందని జావాజత్ అధికారులు వివరించారు. పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి తవాసుల్ ఆన్ లైన్ సర్వీస్ ద్వారా సేవలను కోరిన పక్షంలో జావాజాత్ లోని సంబంధిత అధికారులతో కమ్యూనికేట్ అయ్యేలా చర్యలు ప్రారంభం అవుతాయని అన్నారు. దీని ద్వారా సేవలు కోరే వ్యక్తి నేరుగా జావాజత్ కార్యాలయాన్ని సంప్రదించాల్సిన అవసరం లేదని..ఆన్ లైన్లోనే నాణ్యమైన, వేగవంతమైన సేవలను పొందవచ్చని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష