థీమ్ ఆఫ్ ‘కిన్నెరసాని’ విడుదల చేసిన రాంచరణ్

- February 11, 2021 , by Maagulf
థీమ్ ఆఫ్ ‘కిన్నెరసాని’ విడుదల చేసిన రాంచరణ్

హైదరాబాద్:మెగాస్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత’ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ప్రస్తుతం కళ్యాణ్ దేవ్ ‘కిన్నెరసాని’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు ‘అశ్వథ్థామ’ ఫేమ్ రమణ తేజ్ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.సాయి రిషిక సమర్పణలో ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ మరియు శుభమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రామ్ తళ్లూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా, నేడు కళ్యాణ్ దేవ్ పుట్టిన రోజు సందర్బంగా ‘థీమ్ ఆఫ్ కిన్నెరసాని’ విడుదల చేశారు మెగా పవర్ స్టార్ రాంచరణ్.ఎమోషనల్ గా సాగిన ఈ థీమ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com