హోటల్ రూం బుక్ చేసుకుంటేనే దేశంలోకి అనుమతి..
- February 12, 2021
మస్కట్:విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉంటున్న ఒమన్ ప్రభుత్వం..ఎప్పటికప్పుడు పరిస్థితులకు అనుగుణంగా కొత్త సూచనలు చేస్తూ వస్తోంది. ప్రయాణికుల క్వారంటైన్ నిబంధనను పకడ్బందీగా అమలు చేసేందుకు లేటెస్ట్ మరో ఉత్వర్వులు జారీ చేసింది. ఒమన్ వచ్చే ప్రయాణికులు అందరూ క్వారంటైన్ లో ఉండేందుకు వీలుగా ప్రయాణానికి ముందే హోటల్ లో రూం బుకింగ్ చేసుకోవాలని సూచించింది. వారం పాటు అంటే ఏడు రాత్రులు హోటల్ లో ప్రీ బుకింగ్ చేసుకున్నట్లు ఆధారాలు చూపితేనే టికెట్లను కన్ఫమ్ చేయాలంటూ ఒమన్ కు సర్వీసులను నడిపే ఎయిర్ లైన్స్ సంస్థలను విమాయాన సంస్థ ఆదేశించింది. క్వారంటైన్ లో ఉండేందుకు ఒమన్ లోని ఏ హోటల్ లోనైనా రూం బుక్ చేసుకోవచ్చని..హోటల్ ఎంపిక సునాయసంగా చేసుకునేందుకు అధికారులు అప్ డేట్ చేసిన జాబితాను పరిశీలిస్తే మంచిదని సూచించింది. కొత్త నిబంధన ఫిబ్రవరి 12 మధ్యాహ్నం 12 గంటల నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు ఏర్పాటైన సుప్రీం కమిటీ సూచనల మేరకే విమానయాన సంస్థలకు ఆదేశాలు జారీ చేశామని సీఏఏ వివరించింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







