బహ్రెయిన్:కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన 15 మందికి జైలుశిక్ష
- February 12, 2021
మనామా:కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు 15 మంది నిందితులపై నేరం రుజువు కావటంతో జైలు శిక్ష విధించింది క్రిమినల్ కోర్టు. వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు బహ్రెయిన్ మంత్రివర్గం పలు ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చింది. ఒకే చోట ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమికూడొద్దనే నిబంధన అందులో ఒకటి. అయితే..కొందరు వ్యక్తులు భౌతిక దూరాన్ని పాటించటంలో అలక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించిన పోలీసులు..క్షేత్రస్థాయిలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఐదుగురి కంటే ఎక్కువ సంఖ్యలో గుమికూడిన 15 మందిని అదుపులోకి తీసుకొని కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలించారు. విచారణ చేపట్టిన క్రిమినల్ కోర్టు..నిందితులు నిబంధనలు ఉల్లంఘించినట్లు నిర్ధారించి ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష, 1000 దినార్ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







