తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- February 12, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కొంచెం పెరిగింది... రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 143 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... ఒక్కరు కరోనాతో మృతిచెందగా... కరోనాబారినపడిన 152 మంది బాధితులు పూర్తి స్థాయిలో కోలుకున్నారు. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,96,277కు చేరుకోగా.. రికవరీ కేసుల సంఖ్య 2,92,848కు పెరిగింది.ఇక, ఇప్పటి వరకు కరోనాబారిన పడి మృతిచెందినవారి సంఖ్య 1614కు చేరింది. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ శాతం 97.3 శాతంగా ఉంటే..రాష్ట్రంలో 98.84 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్..మరోవైపు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,815 యాక్టివ్ కేసులు ఉండగా... అందులో 838 మంది హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారు.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 28,337 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 82,42,105కు పెరిగిందని చెబుతోంది సర్కార్.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







