'BEL'లో ఉద్యోగావకాశాలు

- February 12, 2021 , by Maagulf
\'BEL\'లో ఉద్యోగావకాశాలు

భారత దేశంలో అత్యంత ప్రముఖ సంస్థల్లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఒకటి. ఇటీవల ఈ సంస్థలోని వివిధ యూనిట్లలోని ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా సంస్థకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం యూనిట్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది.

దేశంలో అత్యంత ప్రముఖ సంస్థల్లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) ఒకటి. ఇటీవల ఈ సంస్థలోని వివిధ యూనిట్లలోని ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా సంస్థకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలిపట్నం యూనిట్ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పది ఖాళీలను భర్తీ చేయనున్నారు. ట్రైనీ ఇంజనీర్-1 విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్టు పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టు ఏడాది పాటు ఉంటుంది. గరిష్టంగా మూడేళ్ల పాటు కాంట్రాక్టును పొడిగించే అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25 వేల పాటు వేతనం చెల్లించనున్నారు.

ఖాళీల వివరాలు...
మొత్తం పది ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అందులో ఐదు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ విభాగానికి చెందినవి కాగా, మరో ఐదు మెకానికల్ ఇంజనీర్ విభాగానికి చెందినవి.

Trainee Engineer-I (Electronics): ఈ విభాగంలో ఐదు ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్స్ తదితర విభాగాల్లో బీఈ, బీఎస్సీ, బీటెక్ డిగ్రీలను చేసిన దరఖాస్తుకు అర్హులు.
Trainee Engineer-I (Mechanical): ఈ విభాగంలో మొత్తం 5 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెకానికల్ విభాగంలో బీఈ, బీఎస్సీ, బీటెక్ డిగ్రీలను పొందిన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ రెండు విభాగాల్లోని పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకు విద్యార్హత పొందిన అనంతరం ఏడాది పాటు సంబంధిత రంగంలో పని చేసిన అనుభవం ఉండాలి. ఇతర విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలంటే..
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 17లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు రూ. 200ను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు రూ. 200ను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. PWD, SC, ST అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్ ఇంటర్వ్యూలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com