విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్..
- February 12, 2021
న్యూ ఢిల్లీ:విమాన ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్.ఎందుకంటే భారత కేంద్ర ప్రభుత్వం విమాన ఛార్జీల మోత మోగించింది. దాదాపు 30 శాతం ఛార్జీలు పెంచుతూ సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇంధనం ధరలు పెరగడమే దీనికి కారణమంటున్నాయి విమానయాన సంస్థలు.మూడు గంటల నుంచి మూడున్నర గంటల ప్రయాణానికి ఒక్కసారిగా 5 వేల 600 రూపాయల ఛార్జీలు పెరిగాయి.ఇదివరకు 18 వేల 600 ఉన్న ఛార్జీలు... 30 శాతం పెరగడంతో 24 వేల 200లకు చేరాయి. తక్కువ దూరం ప్రయాణించాలనుకునేవారికి మాత్రం కాస్త ఊరట కలగనుంది. ఎందుకంటే కేవలం 10 శాతం ఛార్జీలు మాత్రమే పెంచింది. ఈ ఛార్జీల పెరుగుదల కనీసం 200 రూపాయల నుంచి ఉండనుందని కేంద్ర విమానయాన సంస్థ వెల్లడించింది.ఇక స్వదేశీ విమాన ప్రయాణికులపై కూడా భారం పడనుంది. ఇదివరకు 2 వేలు ఉన్న ఛార్జీలు ఇక 2 వేల 200లకు పెరగనున్నాయి. 6 వేలు ఉన్న ఛార్జీలు 7 వేల 800లకు చేరనున్నాయని కేంద్ర విమానయాన సంస్థ ప్రకటించింది.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







