అరకు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ సహా పలువురి దిగ్భ్రాంతి
- February 13, 2021
విశాఖపట్టణం జిల్లా అరకు ఘాట్ రోడ్డులో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోడి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.అరకు రోడ్డు ప్రమాద ఘటన తనను తీవ్రంగా బాధించిందని,మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ప్రార్థిస్తున్నట్టు ఆయన కార్యాలయం తెలుగులో ట్వీట్ చేసింది.
అరకు ఘటనపై ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అలాగే, ఈ ప్రమాదంపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సిఎం కెసిఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్, డీఐజీ కాళిదాసు, ఎస్పీ కృష్ణతో తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడారు. ఘటనపై ఆరా తీశారు.
మరోపక్క, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ మంత్రులు కెటిఆర్ హరీశ్‌రావు, మహమూద్ అలీ ప్రమాదం విషయం తెలిసి విచారం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







