'సర్కారు వారి పాట' సెకండ్ షెడ్యూల్ కోసం దుబాయ్ చేరుకున్న కీర్తి సురేష్
- February 15, 2021
దుబాయ్:సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ మొదటి షెడ్యూల్ షూటింగ్ దుబాయ్‌లో శరవేగంగా పూర్తిచేసుకుంది.తాజాగా ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ రేపు ప్రారంభం కానుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. తాజాగా ‘సర్కారు వారి పాట’ సెకండ్ షెడ్యూల్ షూటింగ్లో పాల్గొనేందుకు కీర్తి దుబాయ్ చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోను కీర్తి తన ఇన్ స్టాగ్రాంలో షేర్ చేసింది. కాగా ఈ సినిమా కోసం కీర్తి సురేష్ ను ఇప్పటివరకు చూడని కొత్త లుక్ లో చూపించబోతున్నారని తెలుస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో సినిమా ఉండనుందని మొదటినుంచి ప్రచారం జరుగుతుంది.కాగా మైత్రీ మూవీ మేకర్స్,14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మహేష్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







