20 నిమిషాల్లోనే వ్యాక్సినేషన్..యూఏఈలో డ్రైవ్ థ్రూ సెంటర్స్ ఏర్పాటు

- February 16, 2021 , by Maagulf
20 నిమిషాల్లోనే వ్యాక్సినేషన్..యూఏఈలో డ్రైవ్ థ్రూ సెంటర్స్ ఏర్పాటు

యూఏఈ:కోవిడ్ వ్యాక్సిన్ ను వీలైనంత తొందరగా కింగ్డమ్ ప్రజలందరికీ అందించేలా కసరత్తు చేస్తోంది యూఏఈ. ఇందులో భాగంగా అబుధాబిలో డ్రైవ్ థ్రూ వ్యాక్సినేషన్ సెంటర్లను ప్రారంభించింది.ఎమిరేట్స్ పరిధిలో ఏర్పాటైన డ్రైవ్ థ్రూ వ్యాక్సినేషన్ ద్వారా కార్లలోనే వచ్చి..వ్యాక్సిన్ తీసుకొని వెళ్లిపోవచ్చు.వ్యాక్సిన్ వేసుకునేందుకు అవసరమైన ఆరోగ్య అర్హతలను పరిశీలించి 20 నిమిషాల్లోనే వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయటం ఈ కేంద్రాల ప్రత్యేకత. అంతేకాదు..ఒక రోజులోనే 700 మంది, ప్రతి గంటకు 60 మంది చొప్పున వ్యాక్సిన్ ఇచ్చేలా డ్రైవ్ థ్రూ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు.ఈ కేంద్రాల ద్వారా కింగ్డమ్ పరిధిలో వ్యాక్సినేషన్ ను మరింత ముమ్మరం చేయటం..ముఖ్యంగా వృద్ధులకు,దీర్ఘకాలిక రోగులకు త్వరతగతిన వ్యాక్సిన్ అందించేందుకు అస్కారం ఏర్పడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.ఇప్పటివరకు 5 మిలియన్ల డోసులను వేశామని..ఇదంతా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బంది చిత్తశుద్ధి వల్లే సాధ్యమైందని అబుధాబి ఆరోగ్య శాఖ చైర్మన్ ప్రశంసించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com