భారత్ లో పెరిగిన పెట్రోల్ ధర
- February 16, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో గత వారం రోజుల నుంచి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి.అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల పెరుగుదల కారణంగా మంగళవారం దేశంలో మరోసారి పెట్రో, డీజిల్ ధరలు పెరిగాయి.దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 30 పైసలు పెరిగి రూ.89.29గా నమోదైంది. లీటర్ డీజిల్ 35 పైసలు పెరిగి రూ.79.70 వద్ద నిలిచింది.ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో లీటర్ రూ.95.75గా నమోదైంది. డీజిల్ దర రూ.86.35 ఉంది.హైదరాబాద్ విషయానికి వస్తే పెట్రోల్ ధర గరిష్ట స్థాయిలో నమోదైంది.లీటర్ పెట్రోల్ ధర రూ.92.84 ఉండగా, డీజిల్ ధర రూ.86.93 ఉంది. ఇంధన ధరలు ఈ స్థాయిలో పెరగడంతో అంతంత మాత్రంగా ఉన్న సామాన్యుడి ఆర్థిక పరిస్థితిపై అధిక ప్రభావాన్ని చూపుతుంది.ప్రతిపక్షాలు సైతం ఇదే విషయంపై ఆందోళన చెందుతున్నాయి.కేంద్రంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..