దుబాయ్ కి చేరిన ఫైజర్ వ్యాక్సిన్..ప్రాధాన్యత ప్రకారం సరఫరా
- February 16, 2021
కోవిడ్ కు విరుగుడుగా వచ్చిన ఫైజర్ బయోన్టెక్ వ్యాక్సిన్ ఎట్టకేలకు దుబాయ్ కి చేరుకుంది. ఎమిరాతి పరిధిలో ఉచితంగా వ్యాక్సిన్ అందించేందుకు నిర్దేశించిన అన్ని జాబ్ కేంద్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నామని దుబాయ్ హెల్త్ అథారిటీ వెల్లడించింది. నిజానికి గతేడాది డిసెంబర్ 23నే వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా ప్రాధాన్య క్రమంలో ప్రజలకు అందించాలని దుబాయ్ హెల్త్ అథారిటీ షెడ్యూల్ చేసుకుంది. అయితే..ప్రపంచ వ్యాప్తంగా ఫైజర్ వ్యాక్సిన్ కు డిమాండ్ పెరగటంతో షార్టెజ్ ఏర్పడిన విషయం తెలిసింది. దీంతో వ్యాక్సిన్ రీషెడ్యూల్ చేసింది డీహెచ్ఏ. ప్రస్తుతం దుబాయ్ కి ఫైజర్ ఫ్రెష్ బ్యాచ్ దిగుమతి కావటంతో..వ్యాక్సిన్ సరఫరాను ముమ్మరం చేస్తోంది. ముందుగా ఫ్రంట్ లైన్ వర్కర్లు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. దుబాయ్ జారీ చేసిన రెసిడెన్సీ వీసా ఉన్న వారికి కూడా జాబ్ కేంద్రాల ద్వారా వ్యాక్సిన్ ఇస్తారు. డీహెచ్ఏ తెలిపిన ప్రాధాన్య వర్గాలు కాకుండా ఇతర ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటే 800342కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!