సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశంలో పాల్గొన్న తారక్
- February 17, 2021
హైదరాబాద్:సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ సైబరాబాద్ పోలీసుల పెట్రోలింగ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ప్రస్తుతం కొనసాగుతోన్న జాతీయ రహదారి భద్రత మాసంలో భాగంగా సైబరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.అలాగే, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశం కూడా జరుపుతున్నారు.దీనికి అతిథిగా ఎన్టీఆర్ వచ్చారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. సైబరాబాద్ పోలీసుల సేవలను కొనియాడారు. ట్రాఫిక్ పోలీసులూ రహదారి భద్రత విషయంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి ఫలితాలను సాధిస్తున్నారని చెప్పారు. డీసీపీ విజయ్‌కుమార్ ఆధర్వ్యంలో పోలీసుల కృషి వల్ల ట్రాఫిక్ జామ్ సమస్యలు, రోడ్డు ప్రమాదాల వంటివి గత మూడేళ్లుగా తగ్గిపోయాయని అన్నారు. హెల్మెట్ పెట్టుకోకపోతే, మద్యం తాగితే సైబరాబాద్ పరిధిలోని రోడ్లలోకి వెళ్లకూడదని వాహనదారులు భావిస్తున్నారని, అంతగా కృషి చేసి ట్రాఫిక్ పోలీసులు మంచి పేరు తెచ్చారని సీపీ సజ్జనార్ చెప్పారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ రైల్వేస్ సందీప్ శాండిల్య, ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!